బిజెపి గ్లామర్ పాలిటిక్స్... ప్రముఖ సినీనటితో ఈటల భేటీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సినీ నటులను వరుసగా సమావేశమవుతూ బిజెపి గెలుపు కోసం సినీ గ్లామర్ ను వాడుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఇటీవల జరిగిన పరిణామాలతో ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ మాజీ టిడిపి, సినీ నటి తెలంగాణ బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడిన సినీ నటి దివ్యవాణి హైదరాబాద్ షామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిసారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, టిడిపిని వీడిన తర్వాత పరిణామాలను ఈటలకు వివరించారు దివ్యవాణి. ఇలా ఇద్దరిమధ్య రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది.