కవిత ఇంటిపై బిజెపి దాడి హేయమైన చర్య..: సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వుందన్న ఆరోపణల నేపథ్యంలో బిజెపి శ్రేణులు ఆమె ఇంటిని ముట్టడించడం రాజకీయ దుమారం రేపింది. క

First Published Aug 24, 2022, 5:06 PM IST | Last Updated Aug 24, 2022, 5:06 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వుందన్న ఆరోపణల నేపథ్యంలో బిజెపి శ్రేణులు ఆమె ఇంటిని ముట్టడించడం రాజకీయ దుమారం రేపింది. కవిత ఇంటి ముట్టడిని టీఆర్ఎస్ నాయకులే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా కవితకు మద్దతుగా నిలిచి బిజెపి తీరును తప్పుబట్టారు. 

ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితకు లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు బిజెపి జాతీయ నాయకులు ఆరోపించడం... స్థానిక బిజెపి నాయకులు ఆమె ఇంటిపై దాడికి దిగడం సరయిన చర్య కాదన్నారు చాడ. నిజంగానే కవితకు డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలుంటే ఆధారాలు బయటపెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాకాకుండా ఇలా బురదజల్లడం, ఇళ్లపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఆధారాలుంటే కవితపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చాడ పేర్కొన్నారు.