తెలంగాణ సర్కార్ జిందాబాద్ అంటున్న బీహార్ వలసకూలీలు
రెండురోజులుగా పస్తులుంటున్నామంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీహార్ వలసకూలీలకు బస్తాడు నిత్యావసరాలు ఇచ్చిపంపించారు పోలీసులు.
రెండురోజులుగా పస్తులుంటున్నామంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీహార్ వలసకూలీలకు బస్తాడు నిత్యావసరాలు ఇచ్చిపంపించారు పోలీసులు. అందులో గోధుమపిండి, బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, నూనె ఉన్నాయి. దీంతో ఖుషీ అయిన బీహారీలు.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మేము బీహార్ కు పోము వాళ్లేమన్నా చేసుకోని.. తెలంగాణలోనే ఉంటాం అంటున్నారు.