పోడుభూమల వివాదం... మంచిర్యాలలో గిరిజన మహిళలపై పోలీసులు దాష్టికం (వైరల్ వీడియో)
మంచిర్యాల జిల్లా కోయపోచగూడలో పోడు భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా కోయపోచగూడలో పోడు భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిరిజనులతో అటవీశాఖ అధికారులు, పోలీసులు వ్యవహరించి తీరుపై రాజకీయ పక్షాలే కాదు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళలు పోలీసులకు ఎదురుతిరగడం... దీంతో మహిళల కాళ్లుచేతులు పట్టుకుని పోలీసులు ఈడ్చుకు వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గిరిజన మహిళలతో పోలీసులు ఇలా అమానుషంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.