తెలంగాణ ధాన్యం కొనుగోలుపై వివాదం... జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆందోళనలు

హైదరాబాద్: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

First Published Apr 7, 2022, 5:32 PM IST | Last Updated Apr 7, 2022, 5:32 PM IST

హైదరాబాద్: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద టీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నల్గొండలో జరిగిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహా దర్నాలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. నిర్మల్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,  మహబూబాబాద్ లో మంత్రి  సత్యవతి రాథోడ్, సంగారెడ్డిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.