Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పాత సచివాలయాన్ని ఇలా కూల్చేస్తున్నారు (చూడండి)

పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కూల్చివేతను ప్రారంభించింది. 

పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కూల్చివేతను ప్రారంభించింది.  నిన్న అర్ధరాత్రి నుంచి పాత సచివాలయంలోని భవనాలను అధికారులు కూల్చివేయడం మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లున్నీ పోలీసులు మూసివేశారు. ఇప్పటికే సచివాలయంలోని కొన్ని భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనాలు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి... శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.