imnagarమహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్...
కరీంనగర్ ; ఆయన రాష్ట్ర కేబినెట్ మినిష్టర్... నిత్యం వివిధ పనుల్లో బిజీబిజీగా వుండే ఆయన ఒక్కసారిగా రైతన్న అవతారం ఎత్తారు.
కరీంనగర్ ; ఆయన రాష్ట్ర కేబినెట్ మినిష్టర్... నిత్యం వివిధ పనుల్లో బిజీబిజీగా వుండే ఆయన ఒక్కసారిగా రైతన్న అవతారం ఎత్తారు. తన హోదాను పక్కనబెట్టి ఓ కూలీగా మారి మహిళా కూలీలతో మమేకమయ్యారు. ఇలా మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతు అవతారం ఎత్తి వ్యవసాయ పనులు చేపట్టారు.
ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో వరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. ఈ క్రమంలో పొలాన్ని నాట్ల కోసం సిద్దం చేయడానికి నాగలి పట్టి, మహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేసారు మంత్రి. అనంతరం మహిళలతో సరదాగా ముచ్చటిస్తూ వారితో కలిసే భోంచేసారు. రైతుబిడ్డగా వ్యవసాయ పనులు చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా తన సింప్లిసిటీని చాటుకున్నారు మంత్రి కొప్పుల.