గవర్నర్ తమిళిసై పై మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మూడు బిల్లులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లులు ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు , మంత్రి కేటీఆర్ లు గవర్నర్ తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.