జగనన్న బాణం: వైయస్ షర్మిలపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ జిల్లా కేంద్రం లొని టిఆర్ఎస్ సభ్యత్వ నమోదులో మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

First Published Feb 16, 2021, 6:49 PM IST | Last Updated Feb 16, 2021, 6:49 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రం లొని టిఆర్ఎస్ సభ్యత్వ నమోదులో మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ని కెసిఆర్ ని కాపాడుకోలేక పోతే తెలంగాణ మాయమై సమైఖ్య రాష్ట్రం అవుతుందని అన్నారు. మొదట్లో జగనన్న బాణం షర్మిలా వస్తుందని తరువాత జగన్ వస్తాడని,ఆ తరువాత చంద్రబాబు వస్తాడని అన్నారు. ఆంధ్రోళ్ళు మళ్ళీ కరెంటు, నీళ్ళు ఎత్తుకుపోతారని అన్నారు. కెసిఆర్ మన రక్షకుడని  మన కెసిఆర్ ని మనం కాపాడుకోవాలని అన్నారు