తెలంగాణలో ఉద్యోగాల జాతర... ఓయూ క్యాంపస్ లో టీఆర్ఎస్ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి టీఆఎస్ ప్రభుత్వం సిద్దమయ్యింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి టీఆఎస్ ప్రభుత్వం సిద్దమయ్యింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంల అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపింది. సీఏం కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగ యువత సంబరాలు చేసుకున్నారు.