Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ ఫ్యాన్స్ కి కేసీఆర్ సర్కార్ బంపరాఫర్... ఉచితంగానే ఇండియా-ఆసిస్ మ్యాచ్ వీక్షించే అవకాశం

హైదరాబాద్ ;  ఇండియా‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 

First Published Sep 26, 2022, 1:51 PM IST | Last Updated Sep 26, 2022, 2:04 PM IST

హైదరాబాద్ ;  ఇండియా‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నగరంలో జరిగిన ఈ మ్యాచ్ ను చూసేందుకు టికెట్ల కోసం ప్రయత్నించి గాయపడ్డ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. టికెట్లు దక్కకున్నా మ్యాచ్ ను చూసే అవకాశాన్ని బాధితులకు కల్పించింది ప్రభుత్వం. స్వయంగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జింఖానా మైదానంలో గాయపడ్డ బాధితులతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లి ఇండియా, ఆసిస్ జట్లమధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ ను వీక్షించారు. కార్పోరేట్ బాక్స్ లో కూర్చుని దర్జాగా మ్యాచ్ చూసే అవకాశాన్ని టికెట్ల కోసం గాయపడ్డ అభిమానులకు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.