Asianet News TeluguAsianet News Telugu

telangana formation day 2022 : ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: ఇవాళ (జూన్ 2 గురువారం) తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయి.

First Published Jun 2, 2022, 12:36 PM IST | Last Updated Jun 2, 2022, 12:36 PM IST

హైదరాబాద్: ఇవాళ (జూన్ 2 గురువారం) తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,  అధికారులు జిల్లాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.   నిజామాబాద్ జిల్లాలో వేముల ప్రశాంత్ రెడ్డి, మెదక్ జిల్లాలో తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహబూబ్ నగర్ జిల్లాలో వి. శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి... ఇలా జిల్లాల్లో మంత్రులు తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కామారెడ్డి జిల్లాలోనూ స్పీకర్ పోచారమే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.