గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఛాలెంజింగ్ బాధ్యతలు..: చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షనే లక్ష్యంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది.
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షనే లక్ష్యంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి గ్రీన్ తెలంగాణ కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన అనిల్ కుర్మాచలం కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జీవింతంలో చాలా ముుఖ్యమైన ఈ రోజుని మొక్క నాటడంతో ప్రారంభిస్తున్నానని అన్నారు. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్రంలో గ్రీనరీ పెంచేందుకు చాలా కృషి చేస్తున్నారని... తనవంతు బాధ్యతగా ఈరోజు మొక్కలు నాటానని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరిపై వుందని అనిల్ కుర్మాచలం అన్నారు.