కేసీఆర్ కుటుంబసభ్యులు హీరోలు... మీరు జీరోలు..: నటి జీవితపైఎఫ్డీసీ చైర్మన్ ఫైర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన సినీనటి జీవితా రాజశేఖర్ పై రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

First Published Aug 26, 2022, 11:26 AM IST | Last Updated Aug 26, 2022, 11:26 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన సినీనటి జీవితా రాజశేఖర్ పై రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిల్లీ లిక్కర్ స్కాంతో కవిత ప్రమేయం వుందని... తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాకే ఆమె ఆస్తులు అమాంతం పెరిగాయన్న జీవిత ఆరోపణలను అనిల్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్దమని కవిత ఇప్పటికే స్పష్టంగా చెప్పారని... నిజంగానే ఆమె అవినీతికి పాల్పడితే బిజెపి ఆధీనంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించవచ్చేకదా? అని అనిల్ ప్రశ్నించారు. 

బిజెపి నాయకుల మెప్పుకోసమే కవిత గురించి జీవిత పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని...  ఇలాగయితే ప్రజలే ఆమెకు బుద్దిచెబుతారని అనిల్ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పైనా జీవిత అవినీతి ఆరోపణలు చేయడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు హీరోలు కాబట్టే త్యాగాలు చేసారు... మీరు జీరోలు కాబట్టే అధికారం కోసం తహతహలాడుతున్నారంటూ జీవిత, బిజెపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అనిల్ కుర్మాచలం.