గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న తెలంగాణ డెయిరీ కార్పోరేషన్ ఛైర్మన్...
హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమితులైన సోమా భరత్ కుమార్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమితులైన సోమా భరత్ కుమార్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మొక్క నాటారు భరత్. పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కల పెంపకం అవసరాన్ని గుర్తించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందానిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారం పేరిట చేపట్టిన మొక్కలపెంపకం మంచి ఫలితాలను ఇస్తోందని... వీటివల్ల ఇప్పటికే తెలంగాణలో పచ్చదనం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడం, వాటిని కాపాడటం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని భరత్ కుమార్ సూచించారు.