Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని ఫోటోకు చెప్పులు, చీపుర్లతో కొడుతూ... ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన

హైదరాబాద్ : భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు విడి సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయం దుమారం రేపుతున్నాయి.

First Published Nov 21, 2022, 2:02 PM IST | Last Updated Nov 21, 2022, 2:02 PM IST

హైదరాబాద్ : భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు విడి సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయం దుమారం రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి ఆందోళనకు దిగితే మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే బిజెపి తీరుకు నిరసనగా తెలంగాణలోనూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాందీభవన్ లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఫోటోను చెప్పులు, చీపుర్లతో కొడుతూ నిరసన తెలిపారు. అయితే వీరిని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించగా తోపులాట జరిగింది. పోలీసులతో  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు.