తెలంగాణ కాంగ్రెస్ దూకుడు... విద్యుత్ సౌధ లోకి రేవంత్ సహా ఎనిమిదిమంది సీనియర్లు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లో భారీ ఆందోళన చేపట్టింది.  

First Published Apr 7, 2022, 5:37 PM IST | Last Updated Apr 7, 2022, 5:37 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లో భారీ ఆందోళన చేపట్టింది.  విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు మందుగానే అప్రమత్తమై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటివారిని హౌస్ అరెస్ట్ చేసారు. అయినప్పటికి పోలీస్ వలయాన్ని తప్పించుకుని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వారు విద్యుత్ సౌధకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయంలోకి కొందరు కాంగ్రెస్ సీనియర్లకు అనుమతిచ్చారు. పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్లు ఎనిమిదిమందిని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర రావును కలిసేందుకు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అనుమతించారు.