రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఓటేసినట్లు జరుగుతున్న ప్రచారంపై సీతక్క స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని... తనను బద్నాం చేసేందుకే అలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. మార్కర్ పడటంతో బ్యాలెట్ పేపర్ పై గీతలు పడ్డాయని... దీంతో ఎక్కడ ఓటు చెల్లదోనని ఎన్నికల అధికారులకు మరో బ్యాలెట్ పేపర్ అడిగినట్లు తెలిపారు. అలా కుదరదని చెప్పడంతో పార్టీ ఆదేశాల మేరకు ఓటు వేసానని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేసారు.