Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ ఎంజీఎంలో క‌రోనా రోగుల‌తో మాట్లాడి, ధైర్యం చెప్పిన‌ కేసీఆర్


తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు.

First Published May 21, 2021, 1:41 PM IST | Last Updated May 21, 2021, 1:41 PM IST

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు. ఆయ‌న వెంట‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, వరంగ‌ల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప‌లువురు అధికారులు ఉన్నారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో క‌లిసి ఎంజీఎంలోని సౌక‌ర్యాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా రోగులను ప‌రామ‌ర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడుగుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగ ఆసుప‌త్రిలో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఔష‌ధాల‌పై సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్‌ సెంట్రల్‌ జైలును   పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుప‌త్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవ‌లే కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలోనూ క‌రోనా రోగుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విష‌యం తెలిసిందే.