మునుగోడు పోలింగ్ ... ఓటింగ్ 90శాతం పైనే..: ఎన్నికల అధికారి వికాస్ రాజ్

నల్గొండ : అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలు మినహా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రశాతంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు.

First Published Nov 3, 2022, 1:33 PM IST | Last Updated Nov 3, 2022, 1:33 PM IST

నల్గొండ : అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలు మినహా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రశాతంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. కేవలం 3 పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు, మరో రెండు చోట్ల వివి పాట్లలో సమస్య తలెత్తిందని... వెంటనే ఎన్నికల సిబ్బంది దాన్ని పరిష్కరించారని అన్నారు. ఇక మర్రిగూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపుచేసారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా 11 గంటల వరకు 25.8 శాతంగా నమోదయ్యిందని  వికాస్ రాజ్ తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా పోలింగ్ 90% దాటుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు మొత్తం 38 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ తెలిపారు.