బిజెపి ఎమెల్యేగా తొలిసారి అసెంబ్లీకి... ఈటల ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
హైదరాబాద్: మంత్రిమండలి నుండి భర్తరప్, టీఆర్ఎస్ కు రాజీనామా, బిజెపిలో చేరి ఎమ్మెల్యేగా హుజురాబాద్ లో ఘన విజయం... తదితర పరిణామాల తర్వాత మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఈటల రాజేందర్.
హైదరాబాద్: మంత్రిమండలి నుండి భర్తరప్, టీఆర్ఎస్ కు రాజీనామా, బిజెపిలో చేరి ఎమ్మెల్యేగా హుజురాబాద్ లో ఘన విజయం... తదితర పరిణామాల తర్వాత మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఈటల రాజేందర్. ఇవాళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈటల అసెంబ్లీకి వెళ్లడానికి సిద్దమవగా ఆయన ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అసెంబ్లీకి వెళ్లేసమయంలో ఈటల వెంట ఎవరూ వెళ్ళడానికి వీలులేదని... ఈ మేరకు తమకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని మేడ్చల్ పోలీసులు సమాచారం ఇచ్చారు. భారీ ర్యాలీలో ఈటల అసెంబ్లీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.