Asianet News TeluguAsianet News Telugu

వందకోట్ల స్కామ్ చేసిన నీ బిడ్డకు ప్రత్యేక విమానాలా కేసీఆర్..: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

పెద్దపల్లి : డిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలపై బహుజన్ సమాజ్ వాది (బిఎస్పీ) పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

First Published Dec 22, 2022, 12:03 PM IST | Last Updated Dec 22, 2022, 12:03 PM IST

పెద్దపల్లి : డిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలపై బహుజన్ సమాజ్ వాది (బిఎస్పీ) పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వందకోట్ల స్కామ్ చేసిన మీ కుంటుబసభ్యులను బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానాల్లో రాత్రికి రాత్రే దొంగల్లాగా డిల్లీకి తరలిస్తారు... వారిపై చీమకుట్టినంతయినా యాక్షన్ లేదు... ఎమ్మెల్సీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయించడం కాదు కనీసం చట్టానికి అప్పగించడం లేదని ప్రవీణ్ అన్నారు. కానీ పొట్టకూటికోసం తాతల కాలంనుండి సాగుచేసుకుంటున్న పోడు భూమి 30 గుంటల కోసం పోరాడితే కేసులు పెడతారా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రవీణ్ కుమార్ నిలదీసారు. బహుజన రాజాధికారం పేరుతో ప్రవీణ్ కుమార్ చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలను, పంటపొలాల్లో వున్న కూలీలతో ప్రవీణ్ ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసారు. అంతేకాకుండా పలుగ్రామాల్లో బిఎస్పీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసైన్డ్, పోడు భూముల సమస్య గురించి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.