Asianet News TeluguAsianet News Telugu

భైంసా మాదే భాగ్యలక్ష్మి ఆలయం మాదే..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా బైంసా నుండి తలపెట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. 

నిర్మల్ జిల్లా బైంసా నుండి తలపెట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. గతంలో హైరదాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభించిప్పుడు ఏమయినా గొడవలు జరిగాయా? అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేసినా బిజెపి కార్యకర్తలు సంయమనంతో వుండి ప్రశాంతంగా పాదయాత్ర సాగించారన్నారు. అలాగే బైంసాలోనూ ప్రశాంతంగా పాదయాత్ర చేస్తామన్నారు. బైంసా మాదే భాగ్యలక్ష్మి ఆలయం మాదేనని బండి సంజయ్ అన్నారు. 

ఎంఐఎం పార్టీతో కుమ్మకయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాస్తోంది... అన్ని వర్గాలకు సమానంగా చూడాలని తాము కోరుతున్నామని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బైంసాలో చేసిన విధ్వంసం ఎక్కడ భయటపడుతుందోననే ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటోందని సంజయ్ అన్నారు. ప్రశాంతంగా పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వానికి భయమెందుకు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

Video Top Stories