కేసీఆర్ పై మర్డర్ కేసు ... ఫారెస్ట్ ఆఫీసర్ హత్యపై బండి సంజయ్ సంచలనం

సిరిసిల్ల : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 

First Published Nov 25, 2022, 1:46 PM IST | Last Updated Nov 25, 2022, 1:46 PM IST

సిరిసిల్ల : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని... సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడని సంజయ్ గుర్తుచేస్తారు. ఇటీవల జరిగిన హుజుర్ నగర్ , నాగార్జున సాగర్ ఉపఎన్నికల సమయంలోనూ కుర్చీ వేసుకుని మరీ పోడుభూముల సమస్యను పరిష్కరిస్తానని మరోసారి నమ్మించాడన్నారు. దీంతో పోడుభూములు తమవేనని గిరిజనులు భావించి సాగుచేసుకుంటున్నారని... సరిగ్గా పంటచేతికి వచ్చే సమయంలో అటవీ అధికారులతో ముఖ్యమంత్రే దాడులు చేయించి నాశనం చేయించారన్నారు. ఇలా దొంగ హామీలతో ప్రజలు, అధికారుల మద్య కొట్లాట పెట్టారని... ఇది చివరకు ఫారెస్ట్ అధికారి హత్యకు దారితాసిందని ఆరోపించారు. ఈ పరిస్థితికి కారకుడు కేసీఆరే కాబట్టి ఆయనపై హత్య కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.