Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కింద సిసి కెమెరా పెట్టా... అన్నీ బయటకు లాగుతా..: బండి సంజయ్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు ఎలా పెంచుతాడో చూస్తానని... సుప్రీం కోర్టుకు వెళ్లయినా అడ్డుకుంటానని తాను అన్నట్లుగా కొందరు లుచ్చా నా కొడుకులు, పాల్తుగాళ్లు, బట్టెబాజ్ గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకేమయినా సిసి కెమెరా పెట్టావా... నీ కేసీఆర్ కింద నేనే సిసి కెమెరా పెట్టా... అన్నీ బయటకు తీస్తానంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. గిరిజన రిజర్వేషన్లను ఆపి అది బిజెపి వాళ్లే చేసారని దుష్ప్రచారం చేయాలనే కుట్రలో భాగంగా ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర హైదరాబాద్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప్పల్ చౌరస్తాకు చేరుకున్న సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఘాటు వ్యాఖ్యలతో తిప్పికొట్టారు.