Asianet News TeluguAsianet News Telugu

వీరతిలకం దిద్ది, మంగళహారతి పట్టి... బండి సంజయ్ ను పాదయాత్రకు పంపిన మహిళలు

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ఇవాళ్టి (సోమవారం) నుండి ప్రారంభంకానుంది. 

First Published Sep 12, 2022, 12:20 PM IST | Last Updated Sep 12, 2022, 12:20 PM IST

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ఇవాళ్టి (సోమవారం) నుండి ప్రారంభంకానుంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని చిత్తారమ్మ గుడినుండి సంజయ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా పాల్గొని  జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నాంపల్లి బిజెపి కార్యాలయం నుండి కుత్బుల్లాపూర్ బయలుదేరే ముందు సంజయ్ మహిళా నాయకులు తిలకం దిద్ది, హారతిపట్టి సాగనంపారు.  అంతకుముందు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బండి సంజయ్.

Video Top Stories