కేసీఆర్ కరప్షన్ గురించి మాట్లాడటం... దెయ్యాలు వేదాలు వల్లించడమే.: బండి సంజయ్ ధ్వజం

కరీంనగర్ : పోడుభూముల, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు.

First Published Jul 11, 2022, 5:14 PM IST | Last Updated Jul 11, 2022, 5:14 PM IST

కరీంనగర్ : పోడుభూముల, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ధరణి అనేది దరిద్రపుగొట్టు పోర్టల్ అని...   దీంతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు వుందని మండిపడ్డారు. చివరకు టీఆర్ఎస్ నేతలే ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన భూములు కేసీఆర్ కుటుంబం, బంధువుల పేరిట మార్చుకున్నారని... తన బండారం బయట పడుతుందనే ఎన్ని లోపాలున్నా ధరణిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు పోడుభూములకు పట్టాలిచ్చేదాకా తమ పోరాటం సాగుతుందని బండి సంజయ్ స్పష్ట చేసారు.