Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్... ఈ పీకిచ్చుడేదో అప్పుడే చేస్తే అయిపోయేదిగా..: బండి సంజయ్ కౌంటర్

కరీంనగర్ : ఐటీ మంత్రి కేటీఆర్ ఏ డ్రగ్స్ టెస్టుకయినా సిద్దమే అంటూ చేసిన ఛాలెంజ్, తనపై చేసిన విమర్శలకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

First Published Dec 21, 2022, 3:04 PM IST | Last Updated Dec 21, 2022, 3:04 PM IST

కరీంనగర్ : ఐటీ మంత్రి కేటీఆర్ ఏ డ్రగ్స్ టెస్టుకయినా సిద్దమే అంటూ చేసిన ఛాలెంజ్, తనపై చేసిన విమర్శలకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాకంటే ముందే కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని ఛాలెంజ్ చేసారు... ఆ తర్వాత నేను చేసాను... అప్పుడే కేటీఆర్ స్పందించాల్సిందని అన్నారు. అప్పుడయితే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడుతుంది... కాబట్టి ఇది బయటపడకుండా విదేశాలకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుని ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. అందుకే ఇప్పుడు ఏదో పీకిస్తా అంటున్నాడు... ఆ పీకిచ్చుడేదో అప్పుడే పీకిస్తే అయిపోయేది కదా అని నిలదీసారు. కేటీఆర్ కిడ్నీ ఇస్తానంటున్నాడు... అయినా అతడి పాడయిపోయిన కిడ్నీ మాకెందుకు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేసారు. 

డిల్లీ లిక్కర్ స్కామ్ తీగలాగితే కేసీఆర్ బిడ్డ కదిలింది... ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొడుకు డొంక కదులుతోందని బండి సంజయ్ అన్నారు. నిన్న కేటీఆర్ ను చూస్తే గ్లామర్ తగ్గినట్లుగా వుందని... ఆయన భయపడుతున్నట్లు మాటలను బట్టి అర్ధమవుతోందని సంజయ్ పేర్కొన్నారు.