టీమ్ లీజ్ టెక్ & హెచ్ఆర్ సదస్సు... ఉద్యోగుల స్పందనిదే (వీడియో)
ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ ''భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు'' అన్న అంశంపై ఇవాళ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. హోటల్ దసపల్లాలో జరిగిన ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు ఔత్సాహికులు పాల్గొన్నారు. మానవ వనరులు టెక్నాలజీని ఉపయోగించుకునేలా చూడటమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథులు వారి అనుభవాలతో కూడిన సలహాలు, సూచనలు అందించారని... అవి తమకెంతో ఉపయోగపడేలా వున్నాయని సదస్సులో పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు.