Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో హైకీ ఫిట్ నెస్ సెంటర్... ప్రారంభించిన విరాట్ కోహ్లీ

 హైదరాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హైదరాబాద్ లో సందడి చేసారు. ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే ఆడేందుకు భారత జట్టుతో కలిసి హైదరాబాద్ కు విచ్చేసిన కోహ్లీ బుధవారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు. 

 హైదరాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హైదరాబాద్ లో సందడి చేసారు. ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే ఆడేందుకు భారత జట్టుతో కలిసి హైదరాబాద్ కు విచ్చేసిన కోహ్లీ బుధవారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు. అయితే ఇవాళ(గురువారం) మణికొండలోని హాల్ మార్క్ హబ్ లోని హైకీ ఫిట్ నెస్ స్టూడియోను కోహ్లీ ప్రారంభించారు. అనంతరం ఓ వ్యాపారసంస్థ యాడ్ షూట్ కోసం కోహ్లీ దాదాపు రెండుగంటల పాటు ఈ జిమ్ లోనే వున్నారు. కోహ్లీ వచ్చినట్లు తెలుసుకున్న క్రికెట్ అభిమానులు మణికొండకు భారీగా చేరుకున్నారు. దీంతో అభిమానుల కోహ్లీ కోహ్లీ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.