Asianet News TeluguAsianet News Telugu

బుక్ మర్చిపోయినందుకు విద్యార్థిని చితకబాదిన టీచర్..

కరీంనగర్ : జిల్లాలో విద్యార్థిని చితకబాదిన సంఘటన కలకలం సృష్టించింది. బడికి వెళ్లే తొందరలో బుక్ మర్చిపోయిన జయంత్ అనే విద్యార్థిపై టీచర్ కిరాతకంగా వ్యవహరించింది. 

First Published Nov 26, 2022, 9:59 AM IST | Last Updated Nov 26, 2022, 9:59 AM IST

కరీంనగర్ : జిల్లాలో విద్యార్థిని చితకబాదిన సంఘటన కలకలం సృష్టించింది. బడికి వెళ్లే తొందరలో బుక్ మర్చిపోయిన జయంత్ అనే విద్యార్థిపై టీచర్ కిరాతకంగా వ్యవహరించింది. కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒక బుక్ మర్చిపోయాడనే కారణంతో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థిపై అందుబాటులో ఉన్న డస్టర్ విసిరేసింది. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయం కాగా హాస్పిటల్‌కు తరలించారు. ఘటన తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారిపై కూడా యాజమాన్యం దాడి చేయడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో పిర్యాదు చేశారు