బ్రతికుండగానే పెన్షన్ దారులు చనిపోయారని రికార్డుల్లో నమోదు చేసిన అధికారులను శిక్షించాలి : జనసేన
అర్హత కలిగిన పెన్షన్ దారులను చనిపోయినట్లు సృష్టించి అనర్హులను చేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం పరిషత్ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో పెన్షన్ దారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసన తెలిపారు.
అర్హత కలిగిన పెన్షన్ దారులను చనిపోయినట్లు సృష్టించి అనర్హులను చేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం పరిషత్ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో పెన్షన్ దారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల పరిషత్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ మోపిదేవి మండల పరిధిలోని 12 సచివాలయాలలో 329 మంది పెన్షన్లకు అర్హత కలిగి ఉండగా 178 మందికి పెన్షన్లు మంజూరు చేశారని, కాగా 155 మంది చనిపోయినట్లు రికార్డులో నమోదు చేశారని, 15 మందిని వివిధ కారణాల రీత్యా అనర్హులుగా పేర్కొన్నారని తెలిపారు. పెన్షన్ దారులకు ఏ కారణం రీత్యా బ్రతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డుల్లో ఎందుకు నమోదు చేశారని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించారని... ఈ నేపథ్యంలో విషయం బయటకు పొక్కడంతో జనసేన ఆధ్వర్యంలో నష్టపోయిన పెన్షన్ దారులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం అందించామని జనసేన నాయకులూ తెలిపారు.