Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలి కోసం చార్మినార్ బాంబ్ బెదిరింపులు... పాతబస్తీలో అలజడి

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు తలమానీకంగా నిలిచే చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద బాంబు పెట్టారంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది.

First Published Nov 22, 2022, 1:41 PM IST | Last Updated Nov 22, 2022, 1:41 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు తలమానీకంగా నిలిచే చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద బాంబు పెట్టారంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి నుండి పోలీసులకు చార్మినార్ వద్ద బాంబ్ పెట్టి భారీ పేలుడుకు కుట్ర జరిగిందంటూ మెయిల్ వచ్చింది. దీంతో పరుగున చార్మినార్ వద్దకు చేరుకున్న స్థానిక పోలీసులు సందర్శకులను వెంటనే బయటకు పంపించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ చార్మినార్ వద్దే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడ పట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఊపిరిపీల్చుకున్న పోలీసులు చివరకు ఇదో ఆకతాయి పనిగా గుర్తించారు. 

ప్రియురాలిపై కోపంతో ఓ యువకుడు చార్మినార్ వద్ద బాంబు పెట్టారంటూ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. యువకుడు పంపిన మెయిల్ ఆదారంగా అతడిని గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు.