నూజివీడు ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య.
ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంజనీరింగ్ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా కోడూరు కు చెందిన గంజల మణికంఠగా విద్యార్థిని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్ఐ తలారి రామకృష్ణ ఆధ్వర్యంలో కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు తమతో ఉన్న తోటి స్నేహితుడు ఒక్కసారిగా లేకపోవడంతో త్రిబుల్ ఐటీ విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.