సికింద్రాబాద్ దివ్యాంగుల ఆశ్రమానికి స్ట్రీట్ కాజ్ ఎన్జీవో సహాయం
హైదరాబాద్: కేవలం విద్యార్థుల నిర్వహణలో స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీఓ సంస్థ సమాజ సేవకు పూనుకుంది.
హైదరాబాద్: కేవలం విద్యార్థుల నిర్వహణలో స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీఓ సంస్థ సమాజ సేవకు పూనుకుంది. స్ట్రీట్ కాజ్ వీబీఐటి గత పది సవత్సరాలుగా సమాజ సేవ కోసం విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ప్రాంతంలోని దివ్యాంగుల ఆశ్రమంలో దోమల బెడద ఎక్కువగా వుందని గుర్తించిన స్ట్రీట్ కాజ్ ప్రతినిధులు సాయానికి ముందుకువచ్చారు. దివ్యాంగులకు దొమల బెడదను దూరం చేయడానికి మూడు మస్క్యుటో రెపల్లెంట్ మెషిన్లను ఆశ్రమంలో ఏర్పాటుచేశారు స్ట్రీట్ కాజ్ విబీఐటి సభ్యులు.