హ్యాట్సాఫ్ పుట్టా మధు... బిడ్డలకు పాలిచ్చే తల్లులకోసం బస్టాండ్ లో ప్రత్యేక గది

పెద్దపల్లి : చంటిపిల్లలతో ప్రయాణించే మహిళలు అవస్థలు పడకుండా పెద్దపల్లి జిల్లా మంథని ప్రయాణప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

First Published Nov 8, 2022, 4:30 PM IST | Last Updated Nov 8, 2022, 4:30 PM IST

పెద్దపల్లి : చంటిపిల్లలతో ప్రయాణించే మహిళలు అవస్థలు పడకుండా పెద్దపల్లి జిల్లా మంథని ప్రయాణప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. కేవలం చంటిపిల్లలకు తల్లులు పాలిచ్చేందుకే ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటుచేసారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు తల్లి పుట్ట లింగమ్మ పేరిట సేవాకార్యక్రమాలు చేపడుతున్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేసారు. అమ్మల  కోసం ఏర్పాటుచేసిన ఈ గదిని పుట్టా మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్టా మధు మాట్లాడుతూ... మహిళలను గౌరవించడంలో తాము ఎల్లపుడూ ముందుంటామని అన్నారు. ప్రయాణాల్లో వుండగా తమ బిడ్డలు ఆకలితో ఏడుస్తున్నా పాలివ్వలేని పరిస్థితులు మహిళలకు వుంటాయన్నారు. అలాంటి అవస్థలు ఏ తల్లికీ వుండకూడదనే మంథని ప్రయాణ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. ఇలాంటి సేవాకార్యక్రమాలను లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కొనసాగిస్తూనే వుంటుందని పుట్టా మధు తెలిపారు.