Asianet News TeluguAsianet News Telugu

కోటి వృక్షార్చన... పుట్టినరోజున కేసీఆర్ కు హరిత కానుక


హైదరాబాద్: ప్రకృతి, పచ్చదనం అవసరం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకి  బాగా తెలుసని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు.


హైదరాబాద్: ప్రకృతి, పచ్చదనం అవసరం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకి  బాగా తెలుసని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. అందుకే రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆరేళ్ల హరితహరం, మూడేళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్బంగా సీఎం పుట్టిన రోజు నాడు(ఫిబ్రవరి -17) హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోటి వృక్షార్చన చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణీకులకు వెయ్యి (1,000) ఔషధ మొక్కలు పంపిణీ చేశామన్నారు.

కొచ్చిన్ నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులు మొదటి మొక్కను అందుకున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన అరుణ్ గుప్తా,  సీమా గుప్తా,  ముంబై నుంచి వచ్చిన చిన్నారులు ఆర్యా, జహార్ లు మొక్కలను అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తీసుకున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రయాణీకులు ప్రశంసించారు. తమకు ఇచ్చిన మొక్కలను ప్రేమతో పెంచుకుంటామని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు ముఖ్యమంత్రికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.