దారుణం.. తల్లిని కొడుతున్నాడని.. తండ్రిని ఘోరంగా చంపిన కొడుకు...
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో దారుణం చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు చేతిలో తండ్రి హత్య గురికావడం కలకలం రేగుతోంది. కుటుంబ కలహాలతో తండ్రి రాజేశం చిన్న కొడుకు వెంకటరమణల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి మద్యం సేవించడంతో తండ్రీకొడుకుల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో కొడుకు వెంకట రమణ మద్యం మైకంలో తండ్రి రాజేశంను పూల కుండితో, బండ రాయితో మోది హతమార్చాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.