శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లో దుర్ఘటన... విద్యార్థినిని కాటేసిన పాము
కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లో పాముకాటుకు గురయి విద్యార్థిని హాస్పిటల్ పాలయ్యింది.
కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లో పాముకాటుకు గురయి విద్యార్థిని హాస్పిటల్ పాలయ్యింది. యూనివర్సిటీలో ఎంఎస్సి బోటనీ చదువుతున్న రజిత కాలేజి నుండి హాస్టల్ కు వెళుతుండగా పాము కాటేసింది. దీంతో వెంటనే తోటి విద్యార్థులు ఆమెను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వెంటనే డాక్టర్లు పాముకాటుకు విరుగుడు మందు ఇచ్చి యువతికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు చెబుతున్నారు.