Asianet News TeluguAsianet News Telugu

మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయితే ముద్దు...: సిరిసిల్ల సెస్ బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తవగా నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

First Published Dec 26, 2022, 4:15 PM IST | Last Updated Dec 26, 2022, 4:15 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తవగా నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామప్రజలు పాలకులకు నిరసనను తెలియజేసారు. బ్యాలెట్ బాక్సుల్లో ''మున్సిపల్ వద్దు గ్రామ పంచాయితే ముద్దు'' అంటూ రాసివున్న చిట్టీలు ఓట్ల లెక్కింపు అధికారులు గుర్తించారు. ఇలా ఓటేయకుండా కేవలం తమ నిరసనను తెలియజేస్తూ చిట్టీలు వేయడం అధికార పార్టీపై ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.