పైన లీకులు, కింద జల దిగ్బంధం... ఇది కేసీఆర్ ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టరేట్ పరిస్థితి
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాంప్లెక్స్‌ను ప్రారంభించి 18 రోజులు గడవక ముందే భవనం పై నుంచి లీకులు.. కింది నుంచి వరద నీటిలో భవన సముదాయం చిక్కుకపోయింది. కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లాకు కలెక్టరేట్ భవనం నిర్మించిన సంగతి తెలిసిందే. మూడు ఫ్లోర్లలో కట్టిన ఈ భవనంలోనే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించి డిజైన్ చేయించారు. అయితే, గురువారం కురిసిన భారీ వర్షాలతో కలెక్టరేట్ ఆవరణ అంతా వరద నీటితో నిండిపోయింది.