సింగరేణిలో మోగిన సమ్మె సైరన్... కార్మికుల నిరవధిక సమ్మె
పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాటపట్టారు.
పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న కార్మికులంతా శుక్రవారం (ఇవాళ్టి) నుండి నిరవధిక సమ్మెకు దిగారు. కార్మిక సంఘాల నాయకులు కుమారస్వామి, విశ్వనాథ్ ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమావేశం జరిగింది. అనంతరం సిఐటియూ కార్యాలయం నుండి మెయిన్ చౌరస్తా వరకు కార్మికులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు సింగరేణి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని... లేదంటూ అసెంబ్లీ ముట్టడికి సిద్దమని హెచ్చరించారు.