Asianet News TeluguAsianet News Telugu

7వ రోజు కొనసాగుతున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె

సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏడవ రోజు సమ్మె కొనసాగుతుంది.

First Published Sep 15, 2022, 3:38 PM IST | Last Updated Sep 15, 2022, 3:38 PM IST

సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏడవ రోజు సమ్మె కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి వినతిపత్రం ఇచ్చేందుకు ఆర్జీ-1 సివిల్ ఆఫీస్ కు వెళ్లిన కాంట్రాక్టు కార్మికులను ఎస్ అండ్ పి సి సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణిలో ఉన్న 35వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని... జీవో 22ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు హామీ ఇచ్చినట్టుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను సింగరేణి యాజమాన్యం విచ్చిన్నం చేసే కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కాంట్రాక్టు కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు డివైజిఎం లకు ఆదేశాలు జారీ చేయడం అమానుషమన్నారు. సింగరేణి వేలకోట్ల లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల పాత్ర మరువలేనిదని... కాంట్రాక్టు కార్మికుల కష్టాలను యాజమాన్యం గుర్తించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.