గనిలోకి వెళ్లి తిరిగిరాని కార్మికుడు.. రామగుండంలో టెన్షన్..
పెద్దపల్లి జిల్లా రామగుండం 11ఏ గనిలో మంగళవారం మొదటి షిఫ్టులో విధులు నిర్వహించేందుకు వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడి ఆచూకీ ఇంకా దొరకలేదు.
పెద్దపల్లి జిల్లా రామగుండం 11ఏ గనిలో మంగళవారం మొదటి షిఫ్టులో విధులు నిర్వహించేందుకు వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ప్రకటించిన భూగర్భ గనిలో యాక్టింగ్ పంప్ ఆపరేటర్ గా అత్యవసర సేవలు అందించేందుకు కోడెం సంజీవ్ గనిలోకి దిగాడు. షిప్ట్ అయిపోయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది అధికారులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.