Asianet News TeluguAsianet News Telugu

హరీష్ పై అనుచిత వ్యాఖ్యలు... మైనంపల్లి దిష్టిబొమ్మకు చావుడప్పుతో శవయాత్ర

సిద్దిపేట : ఆర్థిక మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావుపై బిఆర్ఎస్ నాయకులు సీరియస్ అవుతున్నారు. 

First Published Aug 22, 2023, 2:45 PM IST | Last Updated Aug 22, 2023, 2:45 PM IST

సిద్దిపేట : ఆర్థిక మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావుపై బిఆర్ఎస్ నాయకులు సీరియస్ అవుతున్నారు. తన కొడుకుకు మెదక్ టికెట్ ఆశించిన మైనంపల్లి ఆశలు ఫలించలేదు. అక్కడ తిరిగి పద్మా దేవేందర్ రెడ్డికే బిఆర్ఎస్ టికెట్ వరించింది. దీంతో మంత్రి హరీష్ తన కొడుకు రోహిత్ కు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని మైనంపల్లి ఆరోపించాడు. ఇలా హరీష్ పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డ మైనంపల్లి హన్మంతరావుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాపయ్య , సర్పంచ్  అనిత బాలయ్య ఆధ్వర్యంలో మైనంపత్తి హన్మంతరావు దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడు హరీష్ చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. దిష్టిబొమ్మకు పాడెపై పెట్టి చావుడప్పుతో శవయాత్ర నిర్వహించి దహనం చేసారు.