Asianet News TeluguAsianet News Telugu

షాపు యజమాని పై ఎస్సై దాడి, చేయి విరగడంతో స్థానికుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో  విధులను నిర్వహిస్తున్న ఎస్ఐ రమేష్ ఓ కిరాణా షాప్ నిర్వాహకుడిపై నిన్న రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. 

First Published Jun 21, 2023, 11:39 AM IST | Last Updated Jun 21, 2023, 11:39 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో  విధులను నిర్వహిస్తున్న ఎస్ఐ రమేష్ ఓ కిరాణా షాప్ నిర్వాహకుడిపై నిన్న రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన లాటి కి పని చెప్పి షాపు నిర్వాకుడుని చితకబాదారు.ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమేష్ రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో షాపు మూసి వేసే సమయంలో ఇంకా షాప్ ఎందుకు తీసావంటూ సదరునిర్వాకుడి పై లాఠీతో చితక బాదడంతో చెయ్యి విరిగింది. దీంతో ఎస్ఐకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.