Asianet News TeluguAsianet News Telugu

బోనాల జాతరలో ఎస్సైకి యువకుడి ముద్దు (వీడియో)

బోనాల జాతరలో నల్లకుంట ఎస్సై మహేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఎస్సైకి ముద్దు పెట్టి సంచలనం సృష్టించాడు. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో జరిగింది. అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు సందర్భంగా ఎస్సై బందోబస్తులో ఉన్నారు. యువకులు తీన్మార్ డ్యాన్సులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

బోనాల జాతరలో నల్లకుంట ఎస్సై మహేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఎస్సైకి ముద్దు పెట్టి సంచలనం సృష్టించాడు. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో జరిగింది. అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు సందర్భంగా ఎస్సై బందోబస్తులో ఉన్నారు. యువకులు తీన్మార్ డ్యాన్సులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ.. అటుగా వచ్చిన ఎస్సై మహేందర్ దగ్గరకు వెళ్లాడు. ఆయనను దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన మహేందర్.. యువకుడి చెంప చెళ్లుమనిపించారు. చివరకు తన కోపాన్ని తమాయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగాన్ని అక్కడున్న వారిలో ఒకరు ఫోన్‌లో రికార్డు చేశారు. అలా అది వైరల్‌గా మారింది