Asianet News TeluguAsianet News Telugu

శివాజీ, మోదీ అద్భుత చిత్రాలు... బండి సంజయ్ ను ఆకట్టుకున్న ఇళ్లు

చత్రపతి శివాజీ, ప్రధాని మోదీపై అభిమానాన్ని చాటుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ దృష్టిలో పడ్డాడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త మహేష్.  

చత్రపతి శివాజీ, ప్రధాని మోదీపై అభిమానాన్ని చాటుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ దృష్టిలో పడ్డాడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త మహేష్.  నూతనంగా నిర్మించుకున్న తన ఇంటిపై  ప్రధాని నరేంద్ర మోదీ, చత్రపతి శివాజీ చిత్రాలను శాశ్వతంగా ఉండే విధంగా వేయించుకున్నాడు. అయితే ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి విచ్చేసిన సంజయ్ ఈ ఇంటిని చూశారు. దీంతో ఈ ఇంటికి స్వయంగా వెళ్లి దేశభక్తిని, బిజెపి, హిందుత్వంపై అభిమానాన్ని ఇలా చాటుకున్న మహేష్ ను అభినందించారు.    

Video Top Stories