సికింద్రాబాద్ లో భారీ పేలుడు... ఆసుపత్రిలో భార్యాభర్తలు

సికింద్రాబాద్ నల్లగుట్ట లో నేడు ఉదయం భారీ పేలుడు సంభవించింది. 

First Published Sep 3, 2022, 4:14 PM IST | Last Updated Sep 3, 2022, 4:18 PM IST

సికింద్రాబాద్ నల్లగుట్ట లో నేడు ఉదయం భారీ పేలుడు సంభవించింది. బిల్డింగ్ లోని మొదటి ఫ్లోర్ పై ఈ బ్లాస్ట్ సంభవించడంతో ఆ ఫ్లోర్ లో ఎటువంటి గోడలు కూడా మిగలలేదు. పేలుడు ధాటికి ఆ ఫ్లోర్ అంతా పూర్తిగా ధ్వంసమైంది. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల్లో ప్రజలు బ్లాస్ట్ అనంతరం ఒక్కసారిగా పరుగులు తీసిన విధానాన్ని మనం గమనించవచ్చు. గ్యాస్ లీకేజీ వల్లనే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు...క్లూస్ టీం...  అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడి భార్య భర్తల ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ అయి రూమ్ మొత్తం స్ప్రెడ్ కావడంతో,లైట్ లేదా గ్యాస్ స్టౌవ్ వెలిగించే క్రమంలో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు అనుమాస్తున్నారు. రూమ్ లో ఉన్న భార్య భర్తలు ఇద్దరు అప్పుడు నిద్ర మత్తులో ఉండొచ్చని, రూమ్ చిన్నది కావడంతో పేలుడు భారీగా జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.