Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ టీచర్ కు కరోనా... ర్యాపిడ్ పరీక్షలో నెగెటివ్, ఆర్టిపీసీఆర్ లో పాజిటివ్

Mar 18, 2021, 3:24 PM IST

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట కరోనా కలకలం రేగింది. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.  రెండురోజుల కిందట కరోనా ర్యాపిడ్ పరీక్షలో నెగెటివ్ రాగా, ఆర్టిపీసీఆర్ పరీక్షలో బుధవారం పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఉపాధ్యాయుడిని హోం ఐసోలేషన్ చేశారు వైద్యశాఖ అధికారులు. హుటాహుటిన పాఠశాలలో కరోనా హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేసి 70 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మిగతా విద్యార్థులతో పాటు గ్రామస్తులకు కూడా కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఎంహెవో జయపాల్ రెడ్డి తెలిపారు. 
 

Video Top Stories